Friday, March 20, 2026
Homeసినిమా'రామారావు ఆన్ డ్యూటీ' నుండి ఫస్ట్ సాంగ్

‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి ఫస్ట్ సాంగ్

Bul Bul released:  మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మ్యూజికల్ జర్నీ మొదలైయింది. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘బుల్ బుల్ తరంగ్’ పాట విడుదలైయింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిచింది. తాజాగా విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్‘ పాట రవితేజ పాత్రలోని రొమాంటిక్ యాంగిల్ ని ఆవిష్కరించింది. రవితేజ, రజిషా విజయన్ పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్ గా చిత్రీకరించారు. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించడం అభిమానులని అలరిస్తుంది. ఈ పాటలో రవితేజ వేసిన డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ కూల్ అండ్ క్లాస్ గా వున్నాయి.

సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ పాటకు సామ్ సిఎస్ స్వర పరిచిన ట్యూన్ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. ఈ పాటకు రాకేందు మౌళి చక్కని సాహిత్యన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సూపర్ హిట్ పాటతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular