Wednesday, July 1, 2026
Homeసినిమా‘బుల్లెట్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఏఎం రత్నం

‘బుల్లెట్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఏఎం రత్నం

రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘బుల్లెట్’. చౌడప్ప ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెమరీ మేకర్స్ సోమిశెట్టి హరికృష్ణ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా  డైరెక్టర్ చౌడప్ప మాట్లాడుతూ “అక్టోబర్ లో ఈచిత్రం విడుదల కానుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ‘బులెట్’ను తెరకెక్కించాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీశాం” అన్నారు. “స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తివేయడం కాదు, దేశానికి పట్టిన చీడ పురుగులని ఏరీ వేసే ప్రయత్నమే లక్ష్యం; ఇప్పుడున్న ఈ సమాజానికి బుద్ధుడు కూడా రుద్రుడౌతాడని, ‘బుద్ధం శరణం గచ్చామి’ కాదు ‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పే సినిమా అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. హీరో రవి వర్మ కొత్తవాడైనా చాలా బాగా చేశాడు. ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.

హీరో రవి వర్మ మాట్లాడుతూ “ఇది నా ఫస్ట్ మూవీ. నాకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular