Thursday, April 18, 2024
HomeTrending Newsవచ్చేది మా ప్రభుత్వమే: ప్రకాష్ జవదేకర్

వచ్చేది మా ప్రభుత్వమే: ప్రకాష్ జవదేకర్

తెలంగాణాలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని, బిజేపితోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత ప్రకాష్ జవ్దేకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజల పరిపాలన సాగడం లేదని…కుటుంబ, అవినీతి పాలన మాత్రమే కొనసాగుతోందని అయన విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర నేడు 25వ రోజుకు చేరుకుంది, ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్  క్రాస్ రోడ్స్ లో జరిగిన బహిరంగసభలో జవ్దేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాటాడుతూ తెలంగాణాలో ఒక కుటుంబమే రాజ్యమేలుతోందని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, అయినా కొత్త నియామకాలు జరపలేదని వెల్లడించారు. టీఆర్ఎస్ తో పోటీ పడగలిగే సత్తా బిజెపికి మాత్రమే ఉందని, హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపి విజయం సాధిస్తుందని అయన ధీమా వ్యక్తం చేశారు.

రైతులు పండించిన ప్రతి గింజా తాను కొంటానని చెప్పిన కెసియార్ ఇప్పుడు వరి వేస్తే ఉరే అంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. వారి ఇప్పుడెందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి బయటికి వచ్చి రైతులకు భరోసా కల్పించాలని సూచించారు.రైతుల నుంచి మక్కలు కొనకున్నా, రైతులను ఇబ్బంది పెట్టినా కేసీఆర్ ఫాంహౌజ్ ముట్టడిస్తామని, నాగళ్లతో దున్నుతామని బండి హెచ్చరించారు.

తెలంగాణా రాష్ట్రంలో ఎంఐఎంను నామరూపాల్లేకుండా చేస్తామని బండి పునరుద్ఘాటించారు. టిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు డ్రామా అని బండి వ్యాఖ్యానించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారో చెప్పాలని అయన ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్