హైదరాబాద్ లో ఈ-గరుడ పేరుతో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మియాపూర్‌లో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఇక విజయవాడ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండనుంది.
TSRTC: విజయవాడ రూట్‌లో 20 నిమిషాలకో బస్సు
అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’గా సంస్థ నామకరణం చేసింది. మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. అయితే హైదరాబాద్ – విజయవాడ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. దాంట్లో భాగంగా రేపు 10 బస్సులను అందుబాటులోకి తేనున్నారు.