Monday, June 15, 2026
Homeసినిమా'బుట్ట బొమ్మ' విడుదల తేదీ ఖరారు

‘బుట్ట బొమ్మ’ విడుదల తేదీ ఖరారు

వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థగా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం “బుట్ట బొమ్మ”. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న “బుట్ట బొమ్మ” విడుదల తేదీ ప్రచార చిత్రాన్నిఈ రోజు అధికారికంగా సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు.

దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ…‘ బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్టల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండిపోతాయి. ‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు. చిత్రంలోని ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్టల అభినయం కథానుగుణంగా ఆకట్టుకుంటుంది. అలాగే పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. వీటితో పాటు వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు” అన్నారు.

వచ్చే ఏడాది జనవరి 26 న విడుదల అవుతున్న ఈ చిత్రం సినీ అభిమాన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, అలరిస్తుందని తెలిపారు నిర్మాతలు. ఈ చిత్రంలో నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular