Friday, April 19, 2024
Homeసినిమా#NBK108 లో శరత్ కుమార్

#NBK108 లో శరత్ కుమార్

నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108 షూటింగ్ ఇటివలే భారీ యాక్షన్ బ్లాక్ తో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో భారీ సెట్ నిర్మించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడిల లొకేషన్ స్టిల్ విడుదల చేశారు. ప్రస్తుతం #NBK108 రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో వుండబోతున్నాయి. హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్  ప్రొడక్షన్ షైన్ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం. #NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్