Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్బ్యాడ్మింటన్: ప్రన్నోయ్ , మహిళా జోడీ విజయం

బ్యాడ్మింటన్: ప్రన్నోయ్ , మహిళా జోడీ విజయం

BWF:
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరుగుతోన్న వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నేడు నాలుగో రోజు ఇండియా రెండు విభాగాల్లో విజయాలు, ఒక విభాగంలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత ద్వయం ఎమ్మార్ అర్జున్, ధృవ్ కపిల ­21-11; 21-16 తేడాతో రష్యా  జోడీ వ్లాదిమిర్ ఇవనోవ్ – ఇవాన్ సోజోనోవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పురుషుల సింగిల్స్ లో మన ఆటగాడు ప్రన్నోయ్ 21-7; 21-17 తో మలేషియా ఆటగాడు ల్యూ డారెన్ పై విజయం సాధించాడు.

మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి జోడీ ­21-11; 9-21;21-13 తేడాతో చైనా జంట జువాన్-యు టింగ్ పై విజయం సాధించారు.

కాగా, భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు గురువారం మూడో రౌండ్ లో థాయ్ లాండ్ క్రీడాకారిణి చోచువాంగ్ తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రన్నోయ్ లు తమ తర్వాతి రౌండ్లలో ఆడనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular