ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… కరోనా వ్యాప్తి, అకాల వర్షాల ప్రభావం తదితర విషయాల మీద కేబినేట్ లో చర్చించనున్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.