Friday, June 12, 2026
Homeసినిమాఅనుపమ కెరియర్ ఇక పుంజుకునేనా?

అనుపమ కెరియర్ ఇక పుంజుకునేనా?

తెలుగు తెరపై మలయాళ భామల జోరు ఎక్కువ. అలా వచ్చిన పిల్లనే అనుపమ పరమేశ్వరన్. పిల్ల పిట్టలానే ఉంటుంది గానీ .. అభినయం  గట్టిగానే చేస్తుంది. టాలీవుడ్ లోని కుర్ర హీరోలందరి జోడీగా సరిపోయే కుదురైన రూపం అనుపమ సొంతం. ఆకర్షణీయమైన కళ్లు .. ఆకట్టుకునే నవ్వు అనుపమలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ‘అ ఆ’ .. ‘ప్రేమమ్’ .. ‘శతమానం భవంతి’ .. ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘రాక్షసుడు’ హిట్ అయిందిగానీ, అది ఆమె ఖాతాలో చేరలేదు. ఆ సినిమాలో ఆమె పాత్ర కథానాయికగా అనిపించకపోవడమే అందుకు కారణం.

ఆ తరువాత వచ్చిన ‘రౌడీ బాయ్స్’ చూసినవాళ్లు ఈ సినిమా ఆమె చేయకుండా ఉంటే బాగుండునని అనుకున్నారు. రెండేళ్లుగా అనుపమ నుంచి ఒక్క  తెలుగు సినిమా రాకపోవడం .. ఈ ఏడాది ఆరంభంలోనే వచ్చిన ‘రౌడీ బాయ్స్’ ఫ్లాప్ కావడంతో అనుపమ డీలా పడిపోయింది. ’18 పేజెస్’ విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లోనే కృతి శెట్టి .. శ్రీలీల వంటి కొత్త హీరోయిన్స్ ఊపందుకున్నారు. దాంతో అనుపమ తన కెరియర్ విషయంలో బెంగెట్టేసుకుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ‘కార్తికేయ 2’ సినిమా పడింది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.

‘కార్తికేయ 2’లో అనుపమకు కాస్త ప్రాధాన్యత కలిగిన పాత్రనే దొరికింది. హీరో జోడీగా ఆడిపాడే పాత్ర కాకుండా కాస్త సాహసాలు చేసే పాత్రనే అది. ఆమెను కొత్తగా చూపించిన ఈ సినిమా 15రోజులు తిరగముందే 100కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నిఖిల్ కెరియర్లోనే కాదు .. అనుపమ కెరియర్లోను  ఇదే మొదటి 100 కోట్ల సినిమా. చాలా  కాలం తరువాత ఈ స్థాయి హిట్ పడటంతో అనుపమ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక తన కెరియర్ మళ్లీ పుంజుకుంటుందని ఆశపడుతోంది. అలా జరగాలనే ఆశిద్దాం.

Also Read : ఛాలెంజ్ విసిరే పాత్రల కోసం చూస్తున్నాఅనుపమ పరమేశ్వరన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular