Monday, February 26, 2024
HomeTrending Newsఎన్వీ రమణకు జర్నలిస్టుల కృతజ్ఞతలు

ఎన్వీ రమణకు జర్నలిస్టుల కృతజ్ఞతలు

ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షాన  కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పిన జస్టిస్ ఎన్ వి రమణ ….సుధీర్గ కాలంగా వివాదంలో ఉన్న సమస్యను పరిష్కరించారని జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రోజు (శనివారం) ఎన్వీ రమణని ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు. అంతేకాకుండా ఇవ్వాళ ఎన్వీ రమణ జన్మదినం కావడంతో టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట 

RELATED ARTICLES

Most Popular

న్యూస్