Sunday, January 19, 2025
Homeసినిమాపరశురామ్ తో మూవీ మొదలయ్యేనా?

పరశురామ్ తో మూవీ మొదలయ్యేనా?

U r in Que: అక్కినేని నాగ‌చైత‌న్య మాంచి స్పీడు మీదున్నాడు. మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు… ఇలా  వ‌రుస‌ స‌క్సెస్ లు అందుకుని రెట్టించిన ఉత్సాహంతో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. చైత‌న్య న‌టించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ‘.  మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 8న ఇది  ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే.. దీని త‌ర్వాత నాగ‌చైత‌న్య ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారనేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో ప‌ర‌శురామ్ ‘స‌ర్కారు వారి పాట‘ సినిమాని తెర‌కెక్కించాడు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ ఈ సినిమా రికార్డు క‌లెక్ష‌న్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. అయితే.. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ సినిమా కంటే ముందుగా నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయాలనుకున్నారు. దీనికి నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ కూడా క‌న్ ఫ‌ర్మ్ చేశారు కానీ.. మ‌హేష్ తో సినిమా చేసే అవ‌కాశం రావ‌డంతో నాగ‌చైత‌న్య సినిమాని ప‌క్క‌న‌పెట్టి స‌ర్కారు వారి పాట సినిమాని తెర‌కెక్కించాడు.

ఇప్పుడు నెక్ట్స్ మూవీ నాగ‌చైత‌న్య‌తోనే అని ప‌ర‌శురామ్ ప్ర‌క‌టించాడు. ఇక‌ నాగ‌చైత‌న్య‌తో సినిమాలు చేసేందుకు వెంక‌ట్ ప్ర‌భు, కిషోర్ తిరుమ‌ల‌, నందినీ రెడ్డి త‌దిత‌ర ద‌ర్శ‌కులు ఎప్ప‌టి నుంచో వెయిటింగ్ లో ఉన్నారు. మ‌రి.. ప‌ర‌శురామ్ తో సినిమా చేసేందుకు నాగ‌చైత‌న్య ఓకే చెబుతాడా..?  ఓకే చెప్పినా వెంట‌నే డేట్స్ ఇస్తారా..?  అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : జూలై 8న నాగ‌చైత‌న్య ‘థ్యాంక్యూ’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్