Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Khushi-2: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఈ  నిర్మిస్తోంది.  వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. మంచి రొమాంటిక్ కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు. ‘ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23, 2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com