Sunday, May 19, 2024
HomeTrending Newsవైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు

వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు

రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్‌ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్‌ 8 మధ్యాహ్నం 3:30 గంటల వరకు టెండర్లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెక్నికల్‌ బిడ్లు ఓపెన్‌ చేస్తారు. సాంకేతిక అర్హతలు ఉన్న వాటిని పరిశీలించి ఎంపిక చేస్తారు. ప్రైస్‌ బిడ్‌ను జూన్‌ 14 మధ్యాహ్నం 2 గంటలకు తెరుస్తారు. జూన్‌ 1న మధ్యాహ్నం 3 గంటలకు రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ గణపతిరెడ్డి ప్రీ బిడ్‌ మీటింగ్‌ను నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, ఆ జాబితాను కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌కు పంపిస్తారు.

అక్కడి నుంచి అప్రూవల్‌ రాగానే రోడ్లు, భవనాల శాఖ లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌(ఎల్వోఏ) ఇస్తారు. దీని తర్వాత 15 రోజులు సమయం ఇస్తారు. కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌పై సంతకాలన్నీ పూర్తయ్యాక పనులు మొదలుపెడతారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌.. 15 నెలల్లో మెడికల్‌ కాలేజీలు నిర్మించి అప్పగించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను టెండర్‌ షెడ్యూల్‌లో రోడ్లు, భవనాల శాఖ పొందుపరిచింది. కాగా, రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో భాగంగా 8 మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించటానికి చర్యలు తీసుకొన్నారు. అలాగే కాలేజీలకు శాశ్వత భవనాలను నిర్మించాలని సంకల్పించారు. జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, మచిర్యాల్, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండము జిల్లా కేంద్రాల్లో నిర్మించే వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి, నిర్మాణ పనులు ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని, ఇంజినీరింగ్‌ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు టెండర్లను ఆహ్వానించారు.

Also Read భారత మెడికల్ హబ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్