Thursday, March 19, 2026
HomeTrending Newsథాయిలాండ్ లో గంజాయి సాగు చట్టబద్దం

థాయిలాండ్ లో గంజాయి సాగు చట్టబద్దం

ఆసియా దేశం థాయిలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, వాడకాన్ని చట్టబద్ధం చేసి థాయిలాండ్ పెద్ద బాంబే పేల్చింది. అయితే సిగరెట్ లా అంటించి పీల్చడంపై నిషేదం కొనసాగుతుంది. ఆహారపదార్థాల్లో, డ్రింకుల్లో cannabis ను వాడొచ్చు. కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగానికి ఊపిరి పోసేందుకు ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. గంజాయిని నార్కోటిక్స్ జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గంజాయి సాగు,దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు నిన్న ప్రకటించింది. ఫలితంగా గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం..దానిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించింది. దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా,గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.

గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు,నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు. శ్రీలంక కూడా గంజాయిపై ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుందేమో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular