Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సోమవారం బీజేపీలో చేరనున్నారు. అలాగే త‌న  పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్  పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేయనున్నారు.  అమరీందర్ సింగ్ కొద్ది రోజుల క్రితం లండన్‌లో వెన్ను శస్త్రచికిత్స చేయించుకుని.. ఇటీవలే  భారతదేశానికి తిరిగి వచ్చారు. బిజెపిలో చేరిక పై ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా తో ఫలవంతమైన చర్చలు జరిగాయని పార్టీ అధికార ప్రతినిధి ప్రీత్ పాల్ సింగ్ బలియవాల్ ఈ రోజు ఢిల్లీ లో వెల్లడించారు.  ఈ క్ర‌మంలో త‌న స్వంత రాజ‌కీయ‌ పార్టీ  పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను కాషాయ పార్టీలో విలీనం చేయ‌నున్నారు.

అమ‌రీంద‌ర్ సింగ్ సిఎం పదవి నుండి వైదొలిగిన త‌రువాత‌..  కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో అభిప్రాయ భేదాలు త‌ల్లెత్తాయి. దీంతో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి  వైదొలిగారు. అనంత‌రం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ -అనే నూత‌న రాజకీయ పార్టీని స్థాపించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్దతుగా నిలిచినా.. ఘోర ప‌రాజయం పాలయ్యారు.

అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమణ తర్వాత.. కీల‌క ప‌రిణామాలు జ‌రిగాయి.  అమ‌రీంద‌ర్ సన్నిహితంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి బిజెపిలో చేరారు. వారిలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు (PPCC), రాష్ట్ర మంత్రి సునీల్ జాఖర్, కెప్టెన్ కేబినెట్‌లో మంత్రులుగా ప‌నిచేసిన రాజ్ కుమార్ వెర్కా,  దళిత నాయకుడు సుందర్ శామ్ అరోరా, PPCC వర్కింగ్ ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్, ప్రముఖ జాట్-సిక్కు నాయకులు సింగ్ కంగర్ లు కాంగ్రెస్ కు ఊహించిన షాక్ ఇచ్చి.. బీజేపీ తీర్థాన్ని స్వీక‌రించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న కూడా బీజేపీలో చేరాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టాక్.

ఇదిలా ఉంటే..  కేంద్ర మాజీ మంత్రి, పాటియాలా పార్లమెంట్‌ సిట్టింగ్‌ సభ్యురాలు, అమ‌రీందర్‌ సింగ్‌ భార్య ప్రణీత్‌ కౌర్ కూడా బీజేపీలో చేరితే.. ఎలాంటి స్థానం కల్పించాలన్నదే బీజేపీ ముందున్న ప్రధాన సవాల్‌ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇదే త‌రుణంలో ప్రణీత్ కౌర్ తన రాజ‌కీయ వార‌సురాలుగా…తన కుమార్తె జై ఇందర్ కౌర్ ను రాజకీయాల్లోకి తీసుకరావాల‌ని భావిస్తునట్టు తెలుస్తుంది. జై ఇందర్ కౌర్‌కు పాటియాలా లోక్‌సభ టిక్కెట్‌పై బీజేపీ హామీ ఇవ్వాలని కోరుతున్న‌ట్టు తెలుస్తుంది. ప్రణీత్‌ కౌర్ తన భర్త, అతని స్నేహితులు చాలా మంది పార్టీని విడిచిపెట్టినప్పటికీ, ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టకపోవడం పట్ల బిజెపి నాయకత్వం సంతోషంగా లేదని సమాచారం.

ఇదిలా ఉంటే.. జై ఇందర్ తన తల్లిదండ్రులకు ఎన్నికలలో సహాయం చేస్తున్నారు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ స్థానంలో ఆల్ ఇండియా జాట్ మహాసభ అధ్యక్షురాలుగా ఎన్నిక‌య్యారు. ఏదిఏమైనా.. అమ‌రేంద‌ర్ సింగ్ లండన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే.. కెప్టెన్ త‌న పార్టీని బీజేపీలో విలీనం చేసే విషయంపై స్పష్టత వస్తుంది. ప్రణీత్ బీజేపీలో చేరికపై బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com