అన్నమయ్య 32 వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి, భద్రపరిస్తే... వాటిలో 14,932 మాత్రమే కాలానికి దక్కాయి. దొంగలు దొంగిలించినవి కొన్ని. అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి...
మాకు మా అమ్మా నాన్న అపురూపంగా ఏదో పేరు పెట్టారు. మా సినీ అభిమానం వెల్లువలో మా నామకరణం రోజు పెట్టిన పేర్లు ఎప్పుడో కొట్టుకుపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పోషించిన,...
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-90) పద్నాలుగు భాషల్లో అభినివేశం ఉన్న రచయిత. పండితుడు. కవి. విమర్శకుడు. పదమూడో ఏటనుండి చనిపోయేవరకు రాశారు. చివరి క్షణం వరకు విద్యార్థిగా నేర్చుకున్నారు. సాహిత్యంలో ఆయన అధిరోహించిన శిఖరాలు...
"నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు;
బయట కుక్క చేత భంగపడును;
స్థానబలిమి గాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ వినురవేమ !"
నీళ్ళలో ఉన్న మొసలి ఎలాంటి తడబాటు లేకుండా అతిపెద్ద ఏనుగును కూడా నీటిలోకి లాగి పట్టుకోగలుగుతుంది....
సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ(1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో సంగీతంలోకూడా అంతే...
పరమాణువు మొదలు బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించి...పరవశించి పాడుతున్నాడు అన్నమయ్య. అంతటి రూపం అత్యంత సులభంగా అంజనాద్రి మీద వెంకన్న రూపంలో దొరుకుతోందని ఆనందపడుతున్నాడు.
పల్లవి:-
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
చరణం-1
వేదాంతవేత్తలెల్ల...
కొండ అన్న మాటంటే అన్నమయ్యకు పరవశం. ఎన్ని వేల చోట్ల కొండను వర్ణించినా తనివి తీరినట్లు లేదు. పల్లవి ఎత్తుగడలో కొండతో ప్రాంభించినవి, చరణాల్లో కొండను బంధిచినవి కోకొల్లలు. కట్టెదుర వైకుంఠము కాణాచయిన...
మనమేదయినా కొత్త తీర్థానికో, క్షేత్రానికో వెళితే అక్కడ ఎక్కడ ఉండాలో, ఎన్నాళ్ళుండాలో లెక్కలు వేసుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ ఊరికి ఎప్పుడు బయలుదేరి ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించుకుంటాం. అక్కడికెళ్లాక ప్రధానమయిన ప్రదేశాలేవీ...
పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు...
తిరుమల ఉత్సవాల్లో రకరకాల వాహనాల మీద స్వామివారు ఊరేగడాన్ని మనం చూడగలుగుతాం. ఆయా వాహనాల ప్రత్యేకతలు తెలిస్తే మరింత భక్తితో నమస్కారం పెట్టుకుంటాం. అన్నమయ్య మనలా ఎందుకు చూస్తాడు? ఒక ఉత్సవంలో వెంకన్న...