Friday, March 29, 2024
Homeజాతీయంసిబిఐ కి సుప్రీం లో ఎదురుదెబ్బ

సిబిఐ కి సుప్రీం లో ఎదురుదెబ్బ

తృణమూల్ కాంగ్రెస్ నేతలను తమ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్ట్ లో సిబిఐ ఉపసంహరించుకుంది. ఈ కేసును కోల్ కతా హైకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తున్నందున అక్కడే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అయితే నేతల అరెస్టు సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించిన తీరును సుప్రీం తప్పు బట్టింది. ఇది సిబిఐ విచారణపై ఒత్తిడి తీసుకురావడమేనని పేర్కొంది. శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా వ్యవహరించిన మమత, ఆమె మంత్రివర్గంలోని న్యాయ శాఖ మంత్రిపై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.  ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం బిజెపిలో చేరిన నేతలను ఎందుకు అదుపులోకి తీసుకోలేదంటూ సిబిఐని ప్రశ్నించింది.

నారదా కేసు విచారణలో భాగంగా  మమత మంత్రి వర్గంలో పని చేస్తున్న సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఎమ్మెల్యే చందన్ మిత్ర, మాజీ ఎమ్మెల్యే, కోల్ కతా మాజీ మేయర్ సావన్ ఛటర్జీలను అదుపులోకి తీసుకుంది. ఈ నలుగురినీ హౌస్ అరెస్టు లో ఉంచి జ్యుడిషియల్ కస్టడి కింద పరిగణించాలని హైకోర్ట్ సింగల్ బెంచ్ తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీం ను ఆశ్రయించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్