భారత్ బయోటెక్ కంపెనీ భద్రత భాద్యతలను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు(CISF) కు అప్పగించింది. హైదరాబాద్ లోని కంపెనీ వద్ద ఇక నుంచి 24 గంటలు సి.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు రక్షణగా ఉంటాయి. 18 నుంచి 45 ఏళ్ళ వరకు దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర హోం శాఖ మంగళవారం నిర్వహించిన అత్యున్నత సమావేశంలో భారత్ బయోటెక్ రక్షణ భాద్యతలు చేపట్టాలని సి.ఐ.ఎస్.ఎఫ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. వెనువెంటనే రంగంలోకి దిగిన భద్రతాదికారులు శామీర్ పేట్ లోని సంస్థ పరిసరాలు పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పెద్ద మొత్తంలో తయారు చేస్తున్న సంస్థలలో భారత్ బయోటెక్ ఒకటి.