Sunday, October 6, 2024
HomeTrending Newsబాబు ప్రమాణ స్వీకారం 12న

బాబు ప్రమాణ స్వీకారం 12న

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో పలువురు జాతీయ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కొత్తగా ఎంపికైన ఎంపీలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ భేటీలో చంద్రబాబు… ప్రధానమంత్రి మోడీ పక్కనే ఆసీనులయ్యారు, తద్వారా ఆయనకు ఎన్డీఏ కూటమిలో విశేష ప్రాధాన్యం లభించినట్లయింది.

ఆ తర్వాత తెలంగాణ భవన్ లో బస చేసిన ఆ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను బాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ను బాబు కలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలో చంద్రబాబును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఈనెల 7వ తేదీన మరోసారి చంద్రబాబుఢిల్లీ వెళ్ళనున్నారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొని తదనంతరం ఆయా పక్షాల నేతనంతా రాష్ట్రపతి ద్రౌపది మర్మును  కలుసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అదేరోజు కేంద్ర ప్రభుత్వంలో టిడిపికి ఎన్ని మంత్రి పదవులు, ఏఏ శాఖలు, ఇతరత్రా ఏయే పదవులు అన్న దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ముందుగా నిర్ణయించిన ప్రకారం  ఈనెల 8 కాకుండా 9వ తేదీన ప్రధానమంత్రి మోడీ  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దృష్ట్యా ఈనెల 9న ప్రమాణం అదే రోజు ప్రమాణం స్వీకారం చేయాలనుకున్న చంద్రబాబు ఈ తేదీని 12 కు మార్చినట్లు టిడిపి వర్గాలు వెల్లడించాయి. రేపో మాపో దీనిపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్