టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ట్రై చేస్తున్నాడు. ఓ యంగ్ డైరెక్ట‌ర్. గ‌తంలోనే నాగార్జున‌తో ఓ సినిమా గురించి క‌థాచ‌ర్చ‌లు జ‌రిపాడు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇప్పుడు మాత్రం త‌ప్ప‌కుండా సినిమా చేస్తానంటున్నాడు. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు… కార్తికేయ 2 అనే డిఫ‌రెంట్ మూవీ తెర‌కెక్కించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెప్పాడు.

చందు డైరెక్ట్ చేసిన కార్తికేయ 2 ఈ నెల 12న విడుద‌ల కానుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో  చందు ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ప్రేమమ్ త‌ర్వాత నాగార్జున‌తో చందు సినిమా అని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఎందుక‌నో సెట్ కాలేదు. ఈసారి మాత్రం ఖ‌చ్చితంగా చేస్తానంటుడున్నాడు. నాగార్జున కోసం ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ స్టోరీ రెడీ చేశాడ‌ట చందు.

గ‌త కొంత‌కాలంగా ఈ క‌థ గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతునే ఉన్నాయి. నాగార్జున ప్ర‌స్తుతం ది ఘోస్ట్ అనే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్నాడు. ఆత‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి.. చందు మొండేటికి నాగార్జున గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారేమో చూడాలి.

Also Read : నాగార్జున 100వ చిత్రం ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *