అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ‘ఐకాన్’ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. ‘ఐకాన్’ ని ఖచ్చితంగా చేస్తానని బన్చెనీ ప్పారు కానీ.. ఎందుకనో ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ‘వకీల్ సాబ్’తో సక్సెస్ సాధించినప్పటికీ వేణు శ్రీరామ్ నెక్ట్స్ మూవీ కోసం ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నాడు.
ఇదిలా ఉంటే… ఈ కథను రామ్ చరణ్ కి వేణు శ్రీరామ్ ఇటీవల వినిపించారని, ఈ మూవీని చేయడానికి చరణ్ ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. దీన్ని దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ తో శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని దిల్ రాజుచేస్తున్నారు.
ఈ మూవీ తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలని అనుకున్నారు కానీ.. ఇది క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఇప్పుడు వరుసగా కథలు వింటున్న చరణ్ వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పాడని తెలిసింది. శంకర్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత వేణు శ్రీరామ్ తో చరణ్ సినిమా ఉంటుందట. అయితే.. బన్నీకి వేణు శ్రీరామ్ చెప్పిన కథతోనే చరణ్ మూవీ ఉంటుందా..? లేక వేరే కథా..? అనేది తెలియాల్సివుంది.
Also Read : అల్లు అర్జున్ ఆ ప్రయోగం చేస్తాడా?