Friday, March 29, 2024
HomeTrending Newsఅరుణాచ‌ల్ లో కూలిన చీతా హెలికాప్ట‌ర్... మిలిటరీ అధికారుల గల్లంతు

అరుణాచ‌ల్ లో కూలిన చీతా హెలికాప్ట‌ర్… మిలిటరీ అధికారుల గల్లంతు

భార‌తీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్ట‌ర్.. ఇవాళ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కూలింది. ఆ రాష్ట్రంలోని మండ‌లా ప్రాంతంలో కూలిన‌ట్లు తెలుస్తోంది. దాంట్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క‌నిపించ‌కుండాపోయారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో పాటు ఓ మేజ‌ర్ కూడా మిస్సైన‌ట్లు భావిస్తున్నారు. ఇవాళ ఉద‌యం 9.15 నిమిషాల‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్‌తో ఆ హెలికాప్ట‌ర్‌కు సంబంధాలు తెగిపోయిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని బోమిడిలా పశ్చిమంలో ఆప‌రేష‌న‌ల్ సోర్టీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో చీతా హెలికాప్ట‌ర్‌తో ఏటిసి తో సంబంధాలు తెగిపోయిన‌ట్లు మిలిటరీ అధికారులు వెల్ల‌డించారు.

తవాంగ్, బోమిడిలా ప్రాంతాల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నాలుగు దశాబ్దాలలో ఈ ప్రాంతాల్లో సుమారు పది వరకు మిలిటరీ హెలికాప్టర్లు అదృశ్యమయ్యాయి. మిలిటరీ కార్యక్రమానికి వెళ్ళిన రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయింది. దశాబ్దాలుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా అందుకు కారణాలు బయటకు రావటం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్