Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్IPL: ఢిల్లీపై చెన్నై దే విజయం

IPL: ఢిల్లీపై చెన్నై దే విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో  ఢిల్లీ కాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగులతో విజయం సాధించింది. చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా,  లక్ష్య సాధనలో విఫలమైన ఢిల్లీ 20  ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 140 పరుగులే చేసింది,

చెన్నై బ్యాట్స్ మెన్ శివమ్ దూబే-25 (12 బంతుల్లో 3 సిక్సులు); రుతురాజ్ గైక్వాడ్-24; అంబటి రాయుడు-23; రెహానే-21; రవీంద్ర జడేజా-21; ధోని-20 (9బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 3;  అక్షర్ పటేల్ 2; ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

పరుగుల ఖాతా తెరవక ముందే ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔటయాడు, జట్టు స్కోరు 25 కు మరో ఇద్దరు (ఫిల్ సాల్ట్-17; మిచెల్ మార్ష్-5) వెనుదిరిగారు. రీలీ రోస్సో-35;  మనీష్ పాండే-27, అక్షర్ పటేల్ -21 పరుగులతో రాణించినా సరైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోవడం, చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.

చెన్నై బౌలర్లలో మతీష పథిరణ 3; దీపక్ చహార్ 2; రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular