Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IPL Final: చెన్నై సూపర్ కింగ్స్ - ఐపీఎల్ కింగ్!

IPL Final: చెన్నై సూపర్ కింగ్స్ – ఐపీఎల్ కింగ్!

ఐపీఎల్ కింగ్  తామేనని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి నిరూపించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను 5 వికెట్లతో గెలుపొంది 18వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి కప్ గెలవాలన్న గుజరాత్ ఆశలు నెరవేరలేదు. ఆదివారం వర్షం కారణంగా ఫైనల్ ను రిజర్వు డే అయిన సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై బ్యాటింగ్ కు దిగగానే మొదటి ఓవర్లోనే వరుణుడు అడ్డు తగిలాడు. చివరకు సోమవారం అర్ధరాత్రి (మంగళవారం వేకువజామున) 12.10 గంటలకు మ్యాచ్ ను పునఃప్రారంభించి డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ప్రకారం చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు.

విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా మోహిత్ శర్మ వేసిన తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. చివరి రెండు బాల్స్ ను ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టిన జడేజా చెన్నైకు అపూర్వమైన విజయం అందించాడు.

చెన్నై బ్యాట్స్ మెన్ డెవాన్ కాన్వే 25బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47; అజింక్యా రెహానే 13 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 27; రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 26; తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి ఔట్ అయ్యారు.కాగా, కెప్టెన్ ధోనీ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. శివమ్ దూబే 21 బంతుల్లో 2 సిక్సర్లతో 32;  జడేజా 6 బంతుల్లో 1 ఫోర్ 1సిక్సర్ తో 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3;నూర్ అహ్మద్ 2 వికెట్లు సాధించారు.

అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.  గుజరాత్ తొలి వికెట్ కు 67 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 20 బంతుల్లో  7 ఫోర్లతో 39 పరుగులు చేసి ఔట్ కాగా, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 54 రన్స్ చేసి జట్టు స్కోరు 131 వద్ద వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96;  కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 (నాటౌట్) పరుగులు చేయడంతో గుజరాత్ 214 పరుగులు చేసింది.  చెన్నై బౌలర్లలో మతీష పథిరణ 2;  దీపక్ చాహర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

 డెవాన్ కాన్వే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’  లభించగా, శుభ్ మన్ గిల్ ‘ ప్లేయర్ అఫ్ ద సిరీస్’గా నిలిచాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్