విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన  మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్‌గా రూ. 1 కోటి నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీనాక్షి సిఎం జగన్ ను కలుసుకుంది.

మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం , అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి, ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుంది.

వరల్డ్‌ నెంబర్‌ 1 అండర్‌ 12 గర్ల్స్‌ చెస్‌ 2023 (ఫిడే ర్యాంకింగ్స్‌), వరల్డ్‌ నెంబర్‌ 1 అండర్‌ 11 గర్ల్స్‌ చెస్‌ 2022, వరల్డ్‌ నెంబర్‌ 2 అండర్‌ 10 గర్ల్స్‌ చెస్‌ డిసెంబర్‌ 2021, ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ 2022, ఉమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ 2021 టైటిల్స్‌ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రితో  మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు.  వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ. ఇచ్చారు.  ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీనాక్షి తల్లిదండ్రులు డాక్టర్‌ అపర్ణ, మధు కూడా ఉన్నారు.

Also Read : సిఎంను కలిసిన ఆశా మాలవ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *