Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచిదంబర జ్ఞాపకాలు

చిదంబర జ్ఞాపకాలు

బాలచంద్రన్ చుల్లిక్కాడు అనే మళయాల రచయిత పుస్తకాన్నొకటి తమిళంలో “చిదంబర నినైవుగళ్” (నినైవుగళ్ అంటే జ్ఞాపకాలు) అనే పేరిట శైలజ అనువదించారు. ఇందులో 21 వ్యాసాలున్నాయి.

ఈ వ్యాసాలలో ఒక దాని శీర్షిక రక్తం ఖరీదు!

బాలచంద్రన్ చుల్లిక్కాడు దారిద్ర్యంతో బాధపడుతున్న రోజులవి. తిరువనంత పురం నుంచి తన స్వస్థలానికి వెళ్ళేందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు. అయితే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఇస్తే డబ్బు ఇస్తారన్న విషయం తెలుసుకుని అక్కడికెళ్ళి తన రక్తం ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బులతో ఇక ఊరుకి వెళ్ళవచ్చని ఆయన అనుకుంటారు. ఇంతలో అక్కడికి ఒకడొస్తాడు. అతని పేరు కృష్ణన్ కుట్టి. అతనెవరో బాలచంద్రన్ కి తెలీదు. అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెలికి మందులు కొనడానికి డబ్బులు లేక రక్తం అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తే కృష్ణన్ కుట్టి. అతనూ తన రక్తం ఇచ్చి డబ్బులు అందుకుంటాడు.

కృష్ణన్ కుట్టి దగ్గర మందుల చీటీ ఇంగ్లీషులో రాసి ఉండటంవల్ల అది అర్థంకాక కృష్ణన్ కుట్టి తనతో మందుల దుకాణానికి తోడు రావలసిందిగా బాలచంద్రన్ ని కోరాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి మందులు కొనడానికి తన దగ్గరున్న డబ్బులు సరిపోవు. కృష్ణన్ కుట్టికి మరిన్ని డబ్బులు కావలసివస్తాయి. ఏం చేయాలో తెలీని అయోమయస్థితిలో ఉంటాడు. పరిస్థితి గ్రహించిన బాలచంద్రన్ రక్తం ఇచ్చుకోగా తనకు లభించిన డబ్బుల్ని కృష్ణన్ కుట్టికి ఇచ్చి మందులు కొనుక్కోమంటారు.

చిదంబరం ఆలయ సందర్శన మొదలుకుని స్వీడిష్ అకాడమీ వరకూ సాగిన తన జీవితపయనంలోని అనుభవాల కథనమే ఈ చిదంబర జ్ఞాపకాలనే పుస్తకం. తన జీవితంలోని వాస్తవిక సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్న రచయిత బాలచంద్రన్ చుల్లిక్కాడు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్