Monday, June 8, 2026
HomeTrending Newsరేపటి నుంచి కెసిఆర్ హస్తిన పర్యటన

రేపటి నుంచి కెసిఆర్ హస్తిన పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొని, అనంతరం జరిగే బిఎసి సమావేశం తర్వాత సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెల్లనున్నారు.

ఈనెల 25వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు. 26 వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో కెసిఆర్ పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ  మంత్రి పీయూష్ గోయెల్ తో  మాట్లాడుతారు. అదే రోజు సాయంత్రం హైద్రాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular