కోల్ కతా సునాయాస విజయం

ఐపీఎల్ ఈ సీజన్ రెండో విడతతో కోల్ కతా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.. నేడు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా బ్యాట్స్ మెన్ వెంకటేష్ అయ్యర్, రాహూల్ త్రిపాఠి చెలరేగడంతో మరో 29 బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకుంది.

టాస్ గెల్చుకున్న కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ లు ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించారు, తొలి వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 30 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు కేవలం ఐదు పరుగులే చేయగలిగాడు. ఆ తర్వాత కీరన్ పోలార్డ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 21 పరుగులు చేశాడు. ముంబై ఆటగాళ్ళలో డికాక్ అత్యధికంగా  42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.  ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.  కోల్ కతా బౌలర్లలో ఫెర్గ్యుసన్, ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించగా, సునీల్ నరేన్ కు ఒక వికెట్ దక్కింది.

కోల్ కతా తమ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. అయితే జట్టు స్కోరు 40 వద్ద ఓపెనర్ శుభమన్ గిల్ ను బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి తో కలిసి రెండో వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ ముంబై బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఓ ఆటాడుకున్నారు. అయ్యర్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు; త్రిపాఠి 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశారు. కోల్ కతా కోల్పోయిన మూడు వికెట్లూ జస్ ప్రీత్ బుమ్రా కే దక్కాయి.

4 ఓవర్లలో కేవలం 20  మాత్రమే ఇచ్చి కీలకకైన రోహిత్ శర్మ వికెట్ తీసిన సునీల్ నరేన్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *