తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ. (Sence of participation) తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదన. ఈ నిధి కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు 500 రూపాయలు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు 25 రూపాయలు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా సాగేందుకు హరిత నిధిని ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపిన అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సి.ఎస్ సోమేశ్ కుమార్, సిఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీశాఖ) శాంతి కుమారి, పిసీసీఎఫ్ ఆర్.శోభ, సిఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *