Saturday, November 23, 2024
HomeTrending Newsతైవాన్ సరిహద్దుల్లో చైనా ఆగడాలు

తైవాన్ సరిహద్దుల్లో చైనా ఆగడాలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌లో అడుగుపెట్టింది. తైవాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా తెలిపింది. తైవాన్ తమ భూభాగమని చైనా అంటోంది. కాగా, సెనేటర్ ఈడీ మార్కే, ప్రతినిధులు జాన్ గరమెండీ, అలన్ లోవెన్తల్, డాన్ బెయర్, అనుమువా అమట కొలెమన్ రడెవాగెన్ తైవాన్‌లో పర్యటిస్తున్నారు. చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శాంతి, స్థిరత్వం కొనసాగేలా నడుచుకోవాలని ఇప్పటికే చైనాకు అమెరికా సూచించింది.

దీంతో చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలపై తైవాన్ అధ్యక్షుడు నిన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందంతో చర్చలు జరిపారు. తైవాన్ జలసంధి వద్ద చైనా చర్యలు సరికాదని చెప్పింది. నాన్సీ ఫెలోసీ పర్యటన అనంతరం చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు ఇటీవలే ముగిశాయి. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి తైవాన్ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్