Sunday, April 14, 2024
HomeTrending Newsవచ్చే నెలలో అదానీ డేటా సెంటర్ కు శంఖుస్థాపన

వచ్చే నెలలో అదానీ డేటా సెంటర్ కు శంఖుస్థాపన

విశాఖలో అదానీ డేటా సెంటర్ కు వచ్చే నెలలో శంఖుస్థాపన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  తాను సిఎం అయిన తరువాతే అదానీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా  ప్రోత్సహిస్తున్నామని… తమ చొరవ కారణంగానే  బజాంకా కంపెనీ- సెంచరీ ఫ్లై వుడ్, బంగర్లు, శ్రీ సిమెంట్ లాంటి ఎన్నో అంతర్జాతీయ  కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఆదిత్య బిర్లా కంపెనీ కూడా రాష్ట్రంలో కార్యకలాపాలు మొదలు పెట్టిందని గుర్తు చేశారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్‌లో నెలకొల్పిన ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రేవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రారంభించారు.  జపాన్‌కు చెందిన యకహోమా గ్రూప్‌నకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ మొత్తం రెండు దశల్లో రూ. 2,200 కోట్ల పెట్టుబడితో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. మన దేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పిన ఈ సంస్థ తన మూడో ప్లాంట్ ను అచ్యుతాపురం సెజ్ లో ఉత్పత్తి మొదలు పెట్టింది.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సిఎం మాట్లాడుతూ  రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయని, ఈజ్ అఫ్ డూయింగ్ లో మన రాష్ట్రమే మూడేళ్ళుగా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఉన్నాయని, ఇది ఒక్క ఏపీలోనే ఉందన్నారు.   ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో మెరున ఉద్యోగావకాశాలు రావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్థానికులకు 75 శాతం ఉద్యోగాలపై చట్టం చేశామన్నారు.  మూడేళ్ళలో ఎంఎస్ఎంఈలకు  1463 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా  అందించామన్నారు.  మూడేళ్ళలో  మెగా, భారీ కేటగిరీలో 98 పరిశ్రమలు వచ్చాయని, వీటి ద్వారా 39, 350 వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో 60,541 మందికి ఉద్యోగావకావకాశాలు కల్పించగలిగామని; 31,671 ఎంఎస్ఎంఈ ల ద్వారా 8,285 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,98,521 మందికి ఉపాధి చూపగలిగామన్నారు.  రాబోయే రెండేళ్లలో 56 భారీ, మెగా పరిశ్రమలతో  వీటితో లక్షా 54 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, వీటితో 1,64,155మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

అంతకుముందు ప్లాంట్ లోని పలు భాగాలను పరిశీలించిన సిఎం జగన్ వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్