Saturday, November 23, 2024
HomeTrending NewsLi Qiang : చైనా కొత్త ప్ర‌ధానిగా లీ కుయాంగ్‌

Li Qiang : చైనా కొత్త ప్ర‌ధానిగా లీ కుయాంగ్‌

చైనా నూతన ప్ర‌ధానిగా లీ కుయాంగ్‌ ఎన్నిక‌య్యారు. దేశాధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌.. లీ కుయాంగ్‌ పేరును ప్ర‌తిపాదించారు. గ‌తంలో ఆయ‌న క‌మ్యూనిస్టు పార్టీ నేత‌గా చేశారు. నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ స‌మావేశాల్లో జీ జిన్‌పింగ్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ స‌మావేశంలో పాల్గొన్న సుమారు 2900 మంది ప్ర‌తినిధులు దాదాపు లీ కుయాంగ్‌కే ఓటేశారు. 63 ఏళ్ల కియాంగ్‌.. అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు స‌న్నిహితుడు. అయితే దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను స‌రిచేసే బాధ్య‌త‌ల్ని లీ కుయాంగ్‌ అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయి.

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బ్యాలెట్లు వేస్తున్న స‌మ‌యంలో రిపోర్ట‌ర్ల‌ను అనుమ‌తించ‌లేదు. లీకి మొత్తం 2936 ఓట్లు పోల‌య్యాయి. ముగ్గురు ప్ర‌తినిధులు మాత్రం వ్య‌తిరేకంగా ఓటేశారు. మ‌రో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌ధానిగా ఎన్నికైన త‌ర్వాత ఆయ‌న రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌మాణం చేశారు. దేశ నిర్మాణం కోసం కృషి చేయ‌నున్న‌ట్లు లీ కుయాంగ్‌ తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్