Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్BWF World Championships:  సాత్విక్- శెట్టి జోడీకి కాంస్యం

BWF World Championships:  సాత్విక్- శెట్టి జోడీకి కాంస్యం

ఈ నెల మొదటి వారంలో బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన ఊపులో వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కూడా విజేతలుగా నిలవాలన్న సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శేట్టిల ఆశలు ఫలించలేదు.  టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022 పురుషుల డబుల్స్ లో  సెమీస్ కు చేరిన  ఈ జోడీ నేడు జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మలేషియా ద్వయం ఆరోన్ చియా-సోహ్ ఇక్ 20-22; 21-18;21-16తో సాత్విక్- శెట్టి జంటను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టారు. హోరాహోరీగా సాగిన మొదటి సెట్ ను గెల్చుకున్న ఇండియా జోడీ ఆ తర్వాత ప్రత్యర్థి ఆటకు తలవంచక తప్పలేదు.

కామన్ వెల్త్ గేమ్స్ లో మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలతో సత్తా చాటిన భారత ఆటగాళ్ళు వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో ఒకే ఒక కాంస్యం సాధించారు.

Also Read :  సెమీస్ కు సాత్విక్- శెట్టి జోడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్