Saturday, January 18, 2025
Homeసినిమా‘నారప్ప’కు మెగాస్టార్ అభినందనలు

‘నారప్ప’కు మెగాస్టార్ అభినందనలు

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ అయిన ‘అసురన్’ కి రీమేక్ ఇది. సురేష్‌ బాబు, కలైఫులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ నెల 20న ఓటీటీలో నారప్ప విడుదలైంది. నారప్పగా వెంకటేష్ నట విశ్వరూపం చూపించారు అంటూ అభినందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నారప్ప సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “నేను ఇప్పుడే ‘నారప్ప’ చూశాను. వాటే.. పర్ ఫార్మెన్స్. వాటే.. ట్రాన్సఫర్మమేషన్.. నాకు ఎక్కడా వెంకటేష్ కనిపించలేదు.. నారప్పే.. నారప్పే కనిపించాడు. టోటల్ గా కొత్త వెంకటేష్‌ ను చూశాను. క్యారెక్టర్ ను ఎంతగానో అర్ధం చేసుకుని ఎంతో డెప్త్ లోకి వెళ్లి నటించాడు. వెంకటేష్‌ లో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపనతో.. తాపత్రయంతో ఉంటాడు. అలాంటి వాటికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ. మంచి సంతృప్తి ఇచ్చే సినిమా. ఇది మంచి పేరుతో పాటు వెంకటేష్ కెరీర్ లో గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది. నారప్ప టీమ్ అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను” అని తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్