Friday, March 20, 2026
Homeసినిమాకంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు - మెగాస్టార్ చిరంజీవి

కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు – మెగాస్టార్ చిరంజీవి

సీతారామం, బింబిసార‌ చిత్రాల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్ట్ 5, నిన్న విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్‌ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్‌ కమర్షియల్‌ అంశాలతో మాస్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమకథతో, పొయెటిక్‌ లవ్‌ స్టోరీతో క్లాసీ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతుంది. ఇలా బింబిసార, సీతారామం రెండూ విజయవంతంగా రన్‌ అవుతున్నాయి.  మెగాస్టార్‌ చిరంజీవి  తాజాగా ట్విట్టర్‌ ద్వారా అభినందించారు.

“ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న‌ విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా సీతారామం, బింబిసార చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

Also Read : అటు యుద్ధం .. ఇటు ప్రేమ .. మధ్యలో ‘సీతా రామం’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular