Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Race-Walk: ప్రియాంక కు నడకలో రజతం

CWG-2022: Race-Walk: ప్రియాంక కు నడకలో రజతం

కామన్ వెల్త్ గేమ్స్ తొమ్మిదో రోజు నేడు రజత పతకంతో ఇండియా బోణీ కొట్టింది. పదివేల మీటర్ల (పది కిలోమీటర్ల) వాక్ రేస్ లో మన దేశానికి చెందిన క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది.

ఆస్ట్రేలియా  వాకర్ జెమీమా మంటగ్ ఈ లక్ష్యాన్ని 42.34.30నిమిషాల్లో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించగా, ప్రియాంక 43.38.83 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది.

మన దేశ క్రీడాకారిణి భావ్నా జాట్ 47.14.13 నిమిషాల్లో పూర్తి చేసి చివరి (ఏడో) స్థానంలో నిలిచింది.

ప్రియాంక గెల్చిన రజతంతో ఇండియా గెల్చుకున్న మొత్తం పతకాల సంఖ్య  27కు చేరింది. తొమ్మిదేసి బంగారు, రజత, కాంస్య పతకాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular