Thursday, June 18, 2026
HomeసినిమాChiranjeevi: మెగాస్టార్ ప్లాన్ మారిందా..?

Chiranjeevi: మెగాస్టార్ ప్లాన్ మారిందా..?

చిరంజీవి రీ ఎంట్రీ ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసేవారు కానీ.. ఇప్పుడు అలా కాదు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చే్స్తున్నారు. ఆమధ్య నాలుగు సినిమాలను సెట్స పై ఉంచారు. కెరీర్ లో చిరంజీవి ఫస్ట్ టైమ్ ఇలా చేయడం విశేషం. దర్శకుల విషయంలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి సీనియర్స్ డైరెక్టర్ తో కాకుండా… యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట.

అందుకనే ఆ ఇద్దరు దర్శకులను పక్కనపెట్టారని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ… ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు వి.వి.వినాయక్ కాగా, రెండో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే… సీనియర్ డైరెక్టర్స్ వాళ్ల చేయాలనుకున్నదే చేస్తారు కానీ.. తను చెప్పింది వినరు.. చేయరు. అలాంటప్పుడు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకనే సీనియర్ డైరెక్టర్స్ తో కన్నా ఒకటి రెండు సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట. వినాయక్ తోనే రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 చేశారు. ఆతర్వాత వినాయక్ తో మరో మూవీ చేయాలి అనుకున్నారు కానీ.. సెట్ కాలేదు.

అలాగే పూరి జగన్నాథ్ తోనే అసలు రీ ఎంట్రీ మూవీ చేయాలి అనుకున్నారు. ‘ఆటోజానీ’ కథ పూరి చెప్పడం జరిగింది కానీ.. అప్పట్లో సెకండాఫ్ సరిగాలేదని తిరస్కరించారు. రీసెంట్ గా మరో కథ చెప్పాడు కానీ.. ఈ కథకి కూడా చిరు నో చెప్పారు. అయితే.. సీనియర్స్ తను చెప్పే సూచనలు, సలహాలు తీసుకోరు..అందుకనే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మొత్తానికి ప్లాన్ మారింది. మరి.. ఇక నుంచి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular