Thursday, June 18, 2026
HomeసినిమాTimeless love: 23న 'కస్టడీ' సెకండ్ సింగిల్

Timeless love: 23న ‘కస్టడీ’ సెకండ్ సింగిల్

నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’. ఈ చిత్రంలో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మే 12న థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ అందించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, పోలీసుల గొప్పతనాన్ని తెలిపే ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందించారు మేకర్స్. టైమ్‌లెస్ లవ్ అనే పాటను ఈ నెల 23న విడుదల చేయనున్నారు.

మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా టైమ్‌లెస్ ట్రాక్‌ని స్కోర్ చేసారు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది రెట్రో-స్టయిల్ నంబర్. పోస్టర్ నాగచైతన్య, కృతిశెట్టి  క్లాసిక్ డ్యాన్సింగ్ ఫోజ్ లో రెట్రో దుస్తులలో కనిపించారు. చై టోపీ ఉన్న సూట్‌ను ధరించగా, కృతి శెట్టి స్లీవ్‌లెస్ గౌను స్పోర్టింగ్ బన్ హెయిర్‌డోలో ఆకట్టుకుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఆర్‌ కతీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, డివై సత్యనారాయణ ఆర్ట్‌ డైరెక్టర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular