Sunday, February 23, 2025
Homeసినిమాసుకుమార్ కి  మెగాస్టార్ ప్రశంసలు

సుకుమార్ కి  మెగాస్టార్ ప్రశంసలు

Chiru appreciated Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా రికార్డ్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. అలాగే ఓవ‌ర్ సీస్ లో కూడా స‌రికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుండ‌డం విశేషం. ఇదిలా ఉంటే.. పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌ బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న  దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీని ఇటీవల మెగాస్టార్ వీక్షించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమా తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందన్నారు. సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.

Also Read : 200 కోట్ల రూపాయల క్ల‌బ్ లో ‘పుష్ప’

RELATED ARTICLES

Most Popular

న్యూస్