Thursday, April 25, 2024
Homeసినిమాచిరు ‘భోళా శంక‌ర్’ ప్రారంభం

చిరు ‘భోళా శంక‌ర్’ ప్రారంభం

Chiru Mehar Ramesh Bhola Shankar Launched :  

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంక‌ర్’ ఈ రోజు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పై చిత్రీకరించిన ముహూర్తపు స‌న్నివేశానికి లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్ట‌గా, వి.వి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ మూవీ ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన‌ దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, మలినేని గోపీచంద్, ఎన్ శంకర్, రచయిత సత్యానంద్‌లు స్క్రిప్టును దర్శక నిర్మాతలకు అందజేశారు.

ఈ టైటిల్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి సినిమాపై క్రేజ్ ఏర్ప‌డింది. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ , రాఖీ స్పెషల్ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల చిరు పై లుక్ టెస్ట్ నిర్వహించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో మెగాస్టార్‌ను మెహర్ రమేష్ ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, స్మైలింగ్ సెన్సేషన్ కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తుంది. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. భోళా శంకర్ చిత్రాన్ని 2022లో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Must Read :  చిరంజీవి ‘భోళా శంకర్’ టైటిల్ పోస్ట‌ర్‌ రిలీజ్ చేసిన మ‌హేష్‌ బాబు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్