Monday, June 15, 2026
Homeసినిమావెంకీతో చిరు మూవీ ఖరారు?

వెంకీతో చిరు మూవీ ఖరారు?

వెంకీ కుడుములతో చిరంజీవి సినిమా ఉంటుందని, డీవీవీ దీన్ని నిర్మిస్తారని గతంలో వార్తలు వచ్చాయి, ఆ తర్వాతా కథ నచ్చక చిరు ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్  చేసుకున్నట్లు తెలిసింది.  చిరు నో చెప్పడంతో వేరే హీరో కోసం వెంకీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే.. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ చిరుతోనే అంటూ వార్తలు వస్తున్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ తో చిరంజీవి బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ మూవీ 200 కోట్లుకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో తనను ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో చిరంజీవికి బాగా తెలిసింది. అందుచేత ప్రయోగాల జోలికి వెళ్లుళకుండా మాస్  కాకుండా పక్కా మాస్ మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

వీలైనంత త్వరగా ‘భోళా శంకర్’ కంప్లీట్ చేసి వెంకీ కుడుమలతో మూవీ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. వెంకీతో చేయబోతున్నది స్ట్రైట్ స్టోరీ అని తెలుస్తుంది. భోళా శంకర్ తర్వాత వీలైనంత వరకు స్ట్రైట్ స్టోరీస్ నే చేయాలని మెగాస్టార్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. డీవీవీ దానయ్య ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారని.. త్వరలో పూర్తి వివరాలతో ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తారని సమాచారం. ఇది వెంకీ కుడుములకు బంపర్ ఆఫరే.. మరి.. ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular