Sunday, June 14, 2026
Homeసినిమాఅంచనాలు పెంచిన బాలయ్య, పవన్ టీజర్

అంచనాలు పెంచిన బాలయ్య, పవన్ టీజర్

‘ఆహా’ కోసం బాలయ్య చేస్తోన్న  అన్ స్టాపబుల్ టాక్ షో  సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలోనే టాప్ 1 టాక్ షోగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. సెకండ్ సీజన్ లో బాలయ్య సినీ స్టార్స్ తో పాటు పొలిటికల్ స్టార్స్ ను ఇంటర్ వ్యూ చేస్తుండడం విశేషం. చంద్రబాబుతో మొదలైన ఈ షో సరికొత్త అతిథులతో అలరిస్తోంది.  ప్రభాస్ ని కూడా  ఈ షో ద్వారా మాట్లాడించి అతనిలో ఉన్న ఎనర్జీని బయటకి తీసుకొచ్చారు. ప్రభాస్ ఎపిసోడ్ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. ఏకంగా ఆహా సర్వర్లు కూడా  మొరాయించే స్థాయిలో యూజర్స్ ఎటాక్ జరిగింది. రెండు ఎపిసోడ్స్ గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ కు   ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఒటీటీ హిస్టరీలోనే ఇప్పుడు మోస్ట్ బజ్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లో భాగంగా రాబోతుంది. పవన్ కళ్యాణ్ కంటెంట్ ని రెండు ఎపిసోడ్స్ గా ఆహా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది. దీంతో అటు బాలయ్య, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో ఫ్యాంట్ లు వేసిన విషయం పై ఆసక్తిగా అడిగారు. అలాగే ‘త్రివిక్రమ్ నీకు మంచి ఫ్రెండ్ కదా’ అంటే.. “ఫ్రెండ్ షిప్ చేయాల్సి వచ్చింది” అంటూ పవన్ సమాధానమిచ్చారు.

ఇంట్లో రామ్ చరణ్ తో క్లోజ్ అవ్వడం గురించి అడిగితే అవ్వాల్సి వచ్చింది అంటూ అదే  డైలాగ్ చెపారు.  సాయి ధరమ్ తేజ్ ఈ ఎపిసోడ్ లో కొద్ది సేపు సందడి చేసాడు. ఇక పవన్ పెళ్ళిళ్ళ గురించి కూడా  బాలయ్య ప్రశ్నించారు. మొదటి ఎపిసోడ్ లోనే చాలా ఇంటరెస్టింగ్ విషయాలని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో చెప్పించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. మరి.. ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular