జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి దౌపది ముర్ము… జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్ర చూడ్ తో 50వ సర్వోన్నత న్యాయ మూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తో సహా కేంద్రమంత్రులు, ఉప రాష్ట్రపతి తదితర ముఖ్యులు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా… జస్టిస్ డివై చంద్రచూడ్ రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ఆయన నవంబరు 10వతేదీ 2024న పదవీ విరమణ చేయనున్నారు. రెండేళ్ల పాటు పదవిలో ఉన్న న్యాయమూర్తుల్లో జస్టిస్ చంద్రచూడ్ ఒకరు. జస్టిస్ చంద్రచూడ్ మే 13 2016న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అంతకు ముందు అదనపు సొలిసిటర్ జనరల్ గా కూడా ఉన్నారు.