Saturday, June 13, 2026
HomeTrending NewsYS Jagan: సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం గ్రీన్ సిగ్నల్

YS Jagan: సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు సిఎం గ్రీన్ సిగ్నల్

సిక్కులకోసంరాష్ట్రంలో  ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ సింగ్‌ నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలు  క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ తో సమావేశమయ్యారు.

ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఇక్కడ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నామని,  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని సిక్కు పెద్దలు సిఎంకు వివరించారు.  సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారికోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. దీనిపై సిఎం స్పందించి వెంటనే ఆదేశాలిచ్చారు.

గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇచ్చేందుకు,  గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సీఎం అంగీకరించారు.  ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.   వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని సీఎంభరోసా ఇచ్చారు.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంతామని,  ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని సిఎం అభిప్రాయపడ్డారు. 10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular