Saturday, January 18, 2025
HomeTrending Newsవైఎస్ కు సిఎం జగన్ ఘన నివాళి

వైఎస్ కు సిఎం జగన్ ఘన నివాళి

దివంగత నేత డా. వైఎస్సార్ 12వ వర్ధంతి పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు ఆర్పించారు.  వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల, సిఎం జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా వైఎస్ కు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అనంతరం ఘాట్ వద్ద ఉన్న వైఎస్  విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్ భాషా; మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత  తదితరులు కూడా శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.

వైఎస్ వర్ధంతి సందర్భంగా సిఎం జగన్ ట్విట్టర్ ద్వారా కూడా నివాళులర్పించారు. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్