Monday, June 15, 2026
HomeTrending Newsబాగా పనిచేశారు, అభినందనలు : సిఎం జగన్

బాగా పనిచేశారు, అభినందనలు : సిఎం జగన్

వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబిచ్చారు. ప్రతీ అధికారి.. మరీ ముఖ్యంగా లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే ఈ రోజు ప్రజలనుంచి తమను చాలా సంతోషంగా చూసుకున్నారన్న మాట వినిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘మీ అందరికీ నా అభినందనలు’ అంటూ ప్రశంసించారు.  ‘మీ అందరూ కూడా మనం యుద్దం చేస్తున్నది టీడీపీతో…చంద్రబాబుతో కాదు, నెగిటివ్‌ మీడియాతో యుద్దం చేస్తున్నాం, మీడియా సంస్ధలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీకి అధికారం కోసం పనిచేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలి. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి’ అంటూ సూచించారు.

పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోని వరద పీడిత లంక గ్రామాల్లో పర్యటించిన సిఎం జగన్ అనంతరం రాజమండ్రిలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….

  • గోదావరికి వరదల దృష్ట్యా శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలి
  • 1986 వరద తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించింది
  • రాజమహేంద్రవరం నగరానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలి
  • ఎన్యూమరేషన్‌ చేసిన తర్వాత సోషల్‌ ఆడిట్‌ చేస్తే ఎవరైనా మిస్‌ అయితే వారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది
  • అంతా పారదర్శకంగా ఉండాలి, ఎవరూ నష్టపోకూడదు
  • లంక గ్రామాల్లో నష్టతీవ్రతపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం
  • అందరితో మమేకం అయ్యి సహాయక చర్యలు కొనసాగించాలి, ఎక్కడా నిర్లిప్తంగా వ్యవహరించవద్దు
  • గతంలో ఇలాంటి ప్రకృతివైపరీత్యాల సమయంలో కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారు
  • విపత్తుల సమయంలో నాయకులచుట్టూ తిరుగుతూ ఉండడంవల్ల పనుల్లో జాప్యం జరిగేది
  • అధికారులను ఎంపవర్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి
  • వాలంటీర్, సచివాలయం వ్యవస్థ వల్ల ఫలితాలు అందరికీ  అందుతున్నాయి
  • ఆ తర్వాత నేను రావడం వల్ల అన్నీ సవ్యంగా జరిగాయా?లేదా?అని తెలుసుకుంటున్నాను

  • నేను కూడా వరదల సమయంలో వచ్చి, నా చుట్టూ మిమ్మల్ని తిప్పి నలుగురిని సస్పెండ్‌ చేస్తే ఏమవుతుంది?
  • ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి
  • మున్ముందు కూడా ఇదే మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళదాం
  • నేను మార్గనిర్దేశం చేశాను, అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు
  • శానిటేషన్‌ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది
  • మరోవైపు ఎన్యూమరేషన్‌ విషయంలో మరింత పారదర్శకంగా, కచ్చితంగా చేయాలి
  • రెండు వారాల్లో ఇదంతా పూర్తిచేసి తర్వాత సోషల్‌ ఆడిట్‌ కి పెడదాం
  • పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాం
  • ఏ సీజన్‌లో జరిగిన నష్టం ఆ సీజన్‌ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోష పడతారు, దానిపై దృష్టిపెట్టండి
  • ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసుకుని కష్టపడదాం, వారిని మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారు
  • విద్యుత్‌పునరుద్దరణపై ఆరా తీసిన సీఎం.
  • వరద ప్రాంతాలలో ఎక్కడా కూడా కరెంట్‌ పునరుద్దరణలో జాప్యం జరగలేదు కదా? అని ప్రశ్నించిన సీఎం
  • దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కౌంటర్‌ ఇవ్వండని అధికారులకు ఆదేశాలు
  • తప్పులు జరిగితే సరిచేసుకోవాలి అంతేకాని ఏం జరగకపోయినా చేస్తున్న నెగిటివ్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  • అవ డ్రెయిన్‌ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్దం చేయాలి
  • అన్ని లంక గ్రామాల్లో కమ్యూనిటీహాళ్ళ నిర్మాణంచేస్తే విపత్తు సమయంలో పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చు
  • కరకట్టల ఆధునీకరణపై వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్న సీఎం
  • డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేసి వెంటనే నివేదించాలన్న సీఎం
  • రాజమండ్రి పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్న సీఎం.
  • నిపుణులతో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం
  • బండ్‌లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి నవంబర్‌ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుందామన్న సీఎం
  • శాశ్వత చర్యలపై దృష్టిపెడదాం, నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలుపెడదాం

ఈ  సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), గుడివాడ అమర్‌నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Also Read : వరద ప్రాతాల పర్యటనకు సిఎం జగన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular