Saturday, November 23, 2024
HomeTrending Newsసెప్టెంబర్ లోగా ట్యాబ్ ల పంపిణీ: సిఎం ఆదేశం

సెప్టెంబర్ లోగా ట్యాబ్ ల పంపిణీ: సిఎం ఆదేశం

Byjus content:  బైజూస్ యాప్ కోసం ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా ట్యాబ్ లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేసేందుకు వీలుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. వీటిని పరిశీలించాకే కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామని అధికారులు తెలియజేయగా ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సిఎం అన్నారు. తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌ పై సిఎం జగన్ సమీక్ష నిర్వచించారు. బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా అధికారులకు సిఎం తగిన సూచనలు చేశారు…..

  • ట్యాబ్ లకు టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలి
  • ఈ ట్యాబ్ లు 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలి. మూడేళ్లపాటు ట్యాబ్‌ నాణ్యతతో పనిచేయాలి
  • నిర్వహణ కూడా అంత్యంత ముఖ్యం. ఏదైనా సమస్య వస్తే.. వెంటనే దాన్ని రిపేరు చేసేలా ఉండాలి
  • నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలి
  • అలాగే తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం, దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి
  • తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలి
  • బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలి
  • ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలి
  • వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయి. టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది
  • స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, ఎనలార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది
  • డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలి
  • దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలి, జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధంచేయాలి

ఈ సమీక్షా సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : బైజూస్ తో ఒప్పందం : ప్రభుత్వ స్కూళ్ళలో ఎడ్యు-టెక్

RELATED ARTICLES

Most Popular