CM on PRC:
రాబోయే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. తిరుపతి కృష్ణా నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో సిఎం నేడు పర్యటించారు. వర్షాల ధాటికి కూలిన, దెబ్బ తిన్న ఇళ్ళను పరిశీలించిన జగన్ బాధితులతో స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలోనే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు సిఎం ను కలుసుకున్నారు, తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పది రోజుల్లో పీఆర్సీ అమలు చేస్తామని, మిగలిన డిమాండ్లను కూడా త్వరితగతిన అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత, కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి, ఇటీవలే సిఎస్ కు వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో సిఎం జగన్ ప్రకటన వారికి ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు. మరోవైపు, నేడు అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
Also Read : సిఎస్ కు ఉద్యోగ సంఘాల నోటీసు