Friday, March 29, 2024
HomeTrending Newsఅదే మా విశ్వాసం: సిఎం జగన్ ధీమా

అదే మా విశ్వాసం: సిఎం జగన్ ధీమా

రాష్ట్రంలో మొత్తం 175 నియోజక వర్గాలకూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తాము ప్రజలకు మంచి చేశాము కాబట్టే, వారి ఆశీస్సులు మాకు ఉంటాయన్న ధీమా ఉంది కాబట్టే టార్గెట్ 175 అంటూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.  నాయకుడు ఒక మాట చెప్పి దాన్ని నిలబెట్టుకోలేకపోతే రాజకీయాల నుంచి వైదొలిగే పరిస్థితి రావాలని వ్యాఖ్యానించారు.  గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తాము నెరవేర్చాము కాబట్టే తమ ఎమ్మెల్యేలంతా గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ  తిరుగుతున్నారని, చేసిన మంచిని చెబుతున్నారని, తాము మంచి చేశాం కాబట్టే మళ్ళీ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వారు తమ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎప్పుడూ మంచి చేయలేదు కాబట్టే ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన, ఇన్ పుట్ సబ్సిడీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సిఎం జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు.

పెత్తందారీ పార్టీ నేత బాబుకు – మండల అధ్యక్షుల నుంచి కేబినేట్ మంత్రులవరకూ ఎస్సీ, ఎస్టీ. బిసి, మైనార్టీలకు రాజకీయ సాధికారత ఇచ్చిన తమకు మధ్య పోటీ జరగబోతోందని గ్రహించాలని సూచించారు.

రాబోయే రోజుల్లో తమపై ఇంకా కుట్రలు ఎక్కువగా చేస్తారని, ప్రజలు అన్నీ గమనించి, నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలని, మీ  ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ప్రామాణికంగా తీసుకొని తనకు అండగా నిలబడాలని ప్రజలను జగన్ కోరారు.   రైతులను వంచించిన చంద్రబాబు  ఓ వైపు- రైతులకు అండగా ఉన్న తమకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.

కరువుతో ఫ్రెండ్ షిప్ ఉన్న చంద్రబాబు- వరుణ దేవుడి ఆశీస్సులు ఉన్న మనకు;

ప్రభుత్వ స్కూళ్ళలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న బాబుకు – అదే బడులలో నాడు-నేడు తో రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ సిలబస్ పెట్టిన మీ బిడ్డ ప్రభుత్వానికి;

మొదటి సంతకంతో పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని వారిని మోసం చేసి రోడ్డుపైకి లాగిన చంద్రబాబుకు-  వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న అమ్మ ఒడి, 30 లక్షల మందికి ఇళ్ళు కట్టించి ఇస్తున్న మన ప్రభుత్వానికి

గ్రామాల్లో జన్మభూమి కమిటీల నుంచి… పై స్థాయిలో ఉన్న దుష్ట చతుష్టయం  గజదొంగల ముతా దోచుకో-పంచుకో-తినుకో (డిపిటి) సృష్టించిన చంద్రబాబుకు – గ్రామా సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, రాబోతున్న డిజిటల్ లైబ్రరీలతో గ్రామా రూపు రేఖలు మారుస్తున్న మన ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతోందని ప్రజలకు వివరించారు.

Also Read : విద్యను ప్రోత్సహించాలనే….: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్