Saturday, June 13, 2026
HomeTrending Newsకోల్ ఇండియాతో సమన్వయం: సిఎం సూచన

కోల్ ఇండియాతో సమన్వయం: సిఎం సూచన

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని, సింగరేణి, కోల్‌ ఇండియా, ఇతర సంస్థలతో అనునిత్యం సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరా కోసం సరుకు రవాణా షిప్పుల వినియోగంపై ఆలోచించాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పారు.  సూచించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితిపై అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా సిఎం సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశానికి ఇంధన శాఖకార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు

⦿ బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలి
⦿ పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందన్న అధికారులు
⦿ కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు.
⦿ తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలి
⦿ 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలి
⦿ సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలి
⦿ ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత పరిస్థితిని సిఎంకు వివరించిన అధికారులు…

⦿ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతర కరెంటు సరఫరా చేస్తున్నాం
⦿ ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆ మేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నాం
⦿ మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకుల బొగ్గు అదనంగా వచ్చింది
⦿ జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular